గోకవరంలో వీఆర్వోల నిరసన కార్యక్రమం

గోకవరంలో వీఆర్వోల నిరసన కార్యక్రమం

E.G: తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం మండలంలోని 14 గ్రామాల వీఆర్వోలు నిరసన చేపట్టారు. రాష్ట్రం వీఆర్వోల సంఘం పిలుపు మేరకు ఈనెల 16 నుంచి 19 వరకు మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు తెలుపుతున్నట్లు మండల అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. పని భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వీఆర్వోల పోరాటానిక వీఆర్ఏలు మద్దతు పలికారు.