నీట్‌ పరీక్షకు ఆలస్యం.. కన్నీటి పర్యంతమైన తల్లి

నీట్‌ పరీక్షకు ఆలస్యం.. కన్నీటి పర్యంతమైన తల్లి

TG: కరీంనగర్‌లో నీట్ ఎగ్జామ్‌కు 3 నిమిషాలు లేటుగా రావడంతో అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదు. అయితే తన బిడ్డ వైష్ణవి కోసం బంగారం అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించానని తల్లి ఆవేదన చెందింది. పరీక్షకు అనుమతించకపోతే.. భవిష్యత్తు పాడైపోతుందని కంటతడి పెట్టుకుంది. కేవలం 3 నిమిషాలు ఆలస్యం అయ్యిందని, క్షమించండి అంటూ పరీక్ష కేంద్రం వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.