రిజర్వేషన్‌ల సాధనకు ఢిల్లీలో ధర్నా: ఎమ్మెల్యే

MBNR: బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాత పాలమూరులో ఆదివారం జరిగిన బీసీ కులసంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే బీజేపీని బీసీలే పాతాళంలోకి తొక్కుతారని హెచ్చరించారు. 42%రిజర్వేషన్ సాధనకు బీసీలు సంఘటితం కావాలన్నారు