'రైతులు అప్రమత్తంగా ఉండాలి'
KMR: జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఉద్యాన పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సూచించారు. కూరగాయలు, పూలు, మామిడి, అరటి, మిరప, టమోటా పంటల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం తగ్గిన తర్వాతనే ఎరువులు, మందులు వేయాలన్నారు. ఫంగస్ వ్యాధులు నివారించేందుకు కాపర్ ఆధారిత మందులు పిచికారీ చేయాలన్నారు.