తెలంగాణ చౌక్‌లో కొవ్వొత్తులతో నివాళులు
KNR: భగత్ సింగ్ స్ఫూర్తితో దోపిడీ లేని నవ సమాజం కోసం పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.