VIDEO: పిడుగు పడి మత్స్యకారుడు మృతి

WGL: సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేటలో పిడుగు పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. స్థానిక చెరువులో బోనాల సుధాకర్ (45) అనే వ్యక్తి చేపలు పడుతుండగా వర్షం కురుస్తూ పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వృత్తి రీత్యా చేపల వేటలో ఉన్న వ్యక్తి తాను కూర్చున్న తెడ్డు పైనే ప్రాణాలు కోల్పోవడం కలచి వేసింది.