మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు

మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు

HNK: కార్తీక పౌర్ణమి సందర్భంగా కాజీపేట మండలం మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి పంచామృతాలతో మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపోత్సవం, జ్వాలాతోరణం, నారాయణ పూజ, లక్ష పుష్పార్చన, పవళింపు సేవలు వంటి కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.