RMP నిర్లక్ష్యమే తురకపాలెం మరణాలకు కారణమా?

AP: గుంటూరు తురకపాలెం మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే స్థానిక RMPకి వీటితో సంబంధమున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జ్వరంతో బాధపడినవారంతా తొలుత ఈ RMP వద్దే చికిత్స పొందారని, ఆ తర్వాతే వారి ఆరోగ్యం మరింత క్షీణించిందని గుర్తించారు. కలుషిత సెలైన్లు, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడినట్లు విచారణలో తేలింది. దీంతో RMPని అదుపులోకి తీసుకుని క్లీనిక్‌ను సీజ్ చేశారు.