కేయూ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన

కేయూ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన

హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు గురువారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సభ్యురాలు అంకిత ఆధ్వర్యంలో రిజిస్టార్‌కు వినతిపత్రం సమర్పించారు.