కాసేపట్లో బల్కంపేట అమ్మవారి ఊరేగింపు ప్రారంభం

HYD: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బల్కంపేట ఆలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వేలాది మంది భక్తులు అమ్మవారి ఊరేగింపు తిలకించడానికి తరలివచ్చారు. డప్పు చప్పుళ్లతో పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. కాసేపట్లో అమ్మవారి ఊరేగింపుతో మహానగరం దద్దరిల్లనుంది.