చెట్టుకి ఉరేసుకొని యువకుడు మృతి

VSP: పీఎంపాలెంలోని సృజన స్కూల్‌లో ఓ యువకుడు చెట్టుకి ఉరేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందచేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.