జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌ను కలిసిన కలెక్టర్
GNTR: జ్యూడిషల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి మండలం కాజా వద్ద ఉన్న ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో శుక్రవారం డైరెక్టర్‌ను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొన్నారు.