మీసేవ కేంద్రాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

మీసేవ కేంద్రాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

TG: రాష్ట్రంలోని 13 మీసేవ కేంద్రాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. మీసేవ కేంద్రంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దళారుల ద్వారా ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.