అంబులెన్స్ పార్కింగ్ సదుపాయం కల్పించాలని వినతి
VZM: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తమకు అంబులెన్స్ పార్కింగ్ సదుపాయం కల్పించమని, విజయనగరం అంబులెన్స్ డ్రైవర్స్ & ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఆసుపత్రి సూపరెండెంట్, RMO ఆనందకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈమేరకు ప్రెసిడెంట్ అంబులెన్స్ శివ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరల పట్టికను నిర్ణయించి,రోగుల సేవలో తమకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.