'సైబర్ నేరాలపై ప్రజలు అవగాహనతో ఉండాలి'

'సైబర్ నేరాలపై ప్రజలు అవగాహనతో ఉండాలి'

WGL: సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత/ పబ్లిక్ వైఫైలో ఆర్థిక లావాదేవీలు చేయవద్దని, అత్యవసరం అయితేనే వాడాలని సూచించారు. అపరిచిత వెబ్‌సైట్ పాస్‌అప్‌లు తెరవవద్దని, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ కావొద్దని హెచ్చరించారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.