బీజేపీ మండల అధ్యక్షుడిగా జయానంద రెడ్డి

బీజేపీ మండల అధ్యక్షుడిగా జయానంద రెడ్డి

NRPT: మాగనూరు మండల బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం పి.జయానంద రెడ్డి నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టపడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి పాటుపడతానని స్పష్టం చేశారు.