14 పతకాలు సాధించిన బాలికలు
ASR: ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కొయ్యూరు మండలం పెదమాకవరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 14మంది విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనపరచారు. 10బంగారు, 4వెండి పతకాలు సాధించారని హెచ్ఎం సంధ్య తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులు, కోచ్ శ్రీనును హెచ్ఎం, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.