మున్సిపల్ కో - ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఏర్పడిన కోరం
NTR: కొండపల్లి మున్సిపల్ కో - ఆప్షన్ సభ్యుల ఎన్నికకు 15 మంది కౌన్సిలర్‌లు హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావల్సిన ప్రత్యేక సమావేశం మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభం అయ్యింది. కొండపల్లి మున్సిపల్ కో - ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికార పార్టీ కౌన్సిలర్‌లు ఆసక్తి చూపకపోయేసరికి రెండు గంటలు ఆలస్యంగా కో ఆప్షన్స్ సభ్యుల ఎన్నిక మొదలైంది.