ప్రయాణికులకు శుభవార్త..!
W.G: ప్రయాణికుల సౌకర్యార్థం తణుకు నుంచి హైదరాబాద్ BHELకు నిత్యం వెన్నెల స్లీపర్ AC బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బస్సు తణుకు నుంచి రాత్రి 9.30 గంటలకు బయలుదేరి, హైదరాబాద్‌కు 8.35 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర కేవలం రూ. 1,430గా నిర్ణయించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.