అధ్వానంగా మారిన రోడ్డుతో ఇబ్బందులు
PDPL: గోదావరిఖని సప్తగిరి కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాహనాలతో పాటు స్కూళ్లకు వెళ్లే పిల్లలు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. గత 2 రోజుల నుంచి తేలికపాటి వర్షం కురవడంతో మట్టి రోడ్లు కాస్తా బురదమయంగా మారాయి. సంభందిత అధికారులు ఈ రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.