ప్రజల సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం: ఎస్పీ
ATP: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చే ప్రతి పిటీషన్‌ను విచారించి తక్షణమే పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టబద్ధ పరిష్కారం అందించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు.