125 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

SKLM: జిల్లా మందస పట్టణంలోని 125 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ సురేష్ కుమార్ రథీ జెండా ఆవిష్కరణ చేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.