పోలీస్ కమిషనరేట్లో బాబూ జగ్జీవన్జయంతి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు డీసీపీ జీ.బస్వారెడ్డి (అడ్మిన్), కే.రామ్ చందర్ రావ్ (సీఏఆర్)లు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాయతీకి, నిబద్ధతకు నిలువుటద్దంలా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.