మరికాసేపట్లో IPL ఫైనల్.. వాతావరణం ఎలా ఉందంటే?

HYD: కాసేపట్లో కేకేఆర్, SRH మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చెన్నై చెపాక్ స్టేడియంలో వర్షం కురిసే అవకాశం తక్కువేనని అక్యూ వెదర్ తెలిపింది. కాగా నిన్న ఇదే సమయానికి స్టేడియంలో వర్షం కురిసింది. ఒకవేళ ఇవాళ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్ డే ఉంది.