నేడు కోర్టు ముందుకు సహస్ర హత్య కేసు నిందితుడు..!

HYD: కూకట్‌పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడైన బాలుడిని పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితుడు మైనర్ కావడంతో అతడిని సైదాబాద్‌లోని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచారు. అతడిని ఈరోజు జువైనల్ కోర్టులో హాజరుపరిచి, వైద్య పరీక్షల అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించనున్నారు.