VIDEO: ధర్మసాగర్‌లో ఘనంగా శివాజీ శోభాయాత్ర
HNK: ధర్మసాగర్ మండలకేంద్రంలో గురువారం రాత్రి శివాజీ శోభాయాత్రను హిందూ యువ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్డి కాలనీ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగింది. దీంతో మండలకేంద్రం మొత్తం జై శివాజి, జై భవాని నామస్మరణలతో మారుమ్రోగింది.