నేడు జిల్లాలో 18 కేంద్రాల్లో పాలిసెట్ ప్రవేశ పరీక్ష

నేడు జిల్లాలో 18 కేంద్రాల్లో పాలిసెట్ ప్రవేశ పరీక్ష

W.G: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్- 2025 పరీక్ష బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం పట్టణాల్లో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7254 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ డి. ఫణీంద్ర తెలిపారు.