ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడుగా మధు

బాపట్ల: వేమూరు మండల ఆర్య వైశ్యల సమక్షంలో సంఘం అధ్యక్షుడుగా కల్వ మధుని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆర్యవైశ్య సంఘాల అభివృద్ధికి పునాది వేస్తామని చెప్పారు. ఈ ఎన్నిక, తనకు సహకరించిన ఆర్యవైశ్య నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.