మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలి: గంగూలీ
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గిల్‌కు అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలు ఉన్నాయని చెప్పాడు. అతడు కెప్టెన్‌గా ఏమి చేయగలడో ఇంగ్లండ్ సిరీస్‌లో చూపించాడని వ్యాఖ్యానించాడు. గిల్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ చేయాలని చెప్పాడు. అతడు టీమిండియాను సమర్థవంతంగా నడిపించగలడని ధీమా వ్యక్తం చేశాడు.