ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం
VSP: ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. వాహనాల రద్దీ నేపథ్యంలో జంక్షన్లలో పగలు, రాత్రి కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. స్పీడ్ లేజర్ గన్స్‌తో 100 మీటర్ల దూరం నుంచే వేగం, హెల్మెట్ లేకపోవడం, త్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలు గుర్తించి చలానాలు విధిస్తున్నామన్నారు.