మోదీ పర్యటన సన్నాహకాలపై అధికారుల సమావేశం

మోదీ పర్యటన సన్నాహకాలపై అధికారుల సమావేశం

విజయవాడలో సోమవారం టీడీపీ శ్రేణులతో ఆ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, JSP నేతలు అమ్మిశెట్టి వాసు, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధాని మోదీ నిర్వహించనున్న అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి జనసమీకరణ గురించి ఎమ్మెల్యే గద్దె పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.