ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

ఏలూరు గిరిజన భవన్లో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ వెట్రి సెల్వి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సంవత్సరమంతా ప్రజలందరికీ మంచి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.