నర్సరీలో మొక్కల కుండీలు ధ్వంసం
SRPT: అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామ నర్సరీలో గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి వందలాది మొక్కల కుండీలను ధ్వంసం చేసి, భద్రతా వలయాన్ని విరగ్గొట్టారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.