త్వరలో టీచింగ్ హాస్పిటల్ పనులు ప్రారంభం

బాపట్ల: బాపట్లలో నిర్మాణం నిలిచిపోయిన టీచింగ్ హాస్పిటల్ పనులు త్వరలోనే పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం రేపల్లెలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ నారాయణ కోరగా.. సానుకూల స్పందన లభించింది. మంత్రి మాట్లాడుతూ.. ఒక సంవత్సరంలోగా పనులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.