పోటీకి దూరం.. అన్నామలై సంచలన ప్రకటన

పోటీకి దూరం.. అన్నామలై సంచలన ప్రకటన

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఎన్నికల పోటీపై కీలక ప్రకటన చేశారు. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని ముందే కోర్ కమిటీకి లిఖితపూర్వకంగా తెలిపానని వెల్లడించారు. తనకు టికెట్ నిరాకరించారనే వార్తల్లో నిజం లేదని, ఇది తన సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.