గండ్రేడు పంచాయతీలో అధికారుల తనిఖీ

KKD: పెదపూడి మండలం గండ్రేడులో గురువారం ఉదయం డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ తనిఖీలు నిర్వహించారు. తడి, పొడి చెత్త సేకరణపై ఆరా తీశారు. సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్లతో మాట్లాడుతూ.. సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు చేయాలని ఆదేశించారు. కార్యదర్శి లక్ష్మీనారాయణ గ్రామంలోని పరిస్థితులు వివరించారు.