VIDEO: శ్రీరామనవమి వేడుకల్లో ఎంపీ అవినాష్
KDP: పులివెందుల శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, స్థానిక నగరి గుట్ట శ్రీ రాముల ఆలయాన్ని శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సందర్శించారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.