అప్పుడు నిస్తేజం.. ఇప్పుడు ఉత్సాహం!

NLG: ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు గులాబీ దండులో కొత్త ఊపు తెచ్చాయి. HNK జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. 2023 సాధారణ ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న పార్టీ కేడర్ ఈ వేడుకలతో ఉత్సాహంగా పని చేస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి బస్సులు కార్లు సొంత వాహనాల్లో WGLకీ వచ్చారు.