రూ. 1,22,560 జరిమానా విధింపు

TPT: తిరుమలలో బుధవారం పోలీసులు, ఆర్టీవో అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ సర్టిఫికెట్, వాహన ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలపై దృష్టి సారించారు. తనిఖీల్లో 24 వాహనాలను సీజ్ చేసి మొత్తం రూ.1,22,560 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ హరి ప్రసాద్, ఆర్డీవో అధికారులు తదితరులు పాల్గొన్నారు.