మన్యం జిల్లా కు నూతన DEO
పార్వతీపురం జిల్లా విద్యాశాఖాధికారిగా పి.బ్రహ్మజీరావును నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచే శారు. అల్లూరి జిల్లా డీఎస్ఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను పార్వతీపురం మన్యం జిల్లాకు పూర్తి బాధ్య తలను అప్పగిస్తూ బదిలీ చేశారు. ఇక్కడ డీఈఓగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న రాజ్కుమార్ డిప్యూటీఈఓగా కొనసాగనున్నారు.