బాసరలో అక్షయ తృతీయ సందడి

NRML: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా సందడి నెలకొంది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఉమ్మడి ADB DCCB ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది.