తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. అక్కడి ఓ టీ స్టాల్ వద్ద ఓ 20 ఏళ్ల యువకుడు నాటు తుపాకీతో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చుకుని చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన వాసిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.