మిట్ట కండ్రిగలో చెరుకు తోట దగ్ధం
CTR: శ్రీరంగరాజపురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ మిట్టకండ్రిగ హరిజనవాడలో రైతు నవీన్‌కు చెందిన ఐదు ఎకరాల చెరుకు తోట అగ్నికి ఆహుతైంది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన తెల్లబెల్లం కూడా కాలిపోయింది. దీంతో దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.