అనారోగ్యం వదంతులపై క్లారిటీ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో.. ఆయన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. ఏకంగా ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై 'అవి మీ దృష్టికి వచ్చాయా' అని తాజాగా ట్రంప్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ‘లేదు.. నా ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నాను’ అని చెప్పారు.