డయేరియా నివారణ పై అవగాహన

NLG: చిన్నపిల్లలలో డయేరియా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నందున ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి ORS ప్యాకెట్లు,జింకు మాత్రలు పంపిణీ చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ అన్నారు. పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించారు. ఈనెల 16- 30 వరకు వీటిని వినియోగించడంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.