'ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి'
MNCL: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మావోయిస్టులపై చేసిన బహిరంగ ప్రకటనను నిరసిస్తూ సోమవారం మంచిర్యాలలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 23 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో సుమారు 780 మందిని చంపారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.