రూల్స్ జానతా నై.. 'సిండికేట్'గా నొక్కేశారు..!

రూల్స్ జానతా నై.. 'సిండికేట్'గా నొక్కేశారు..!

HYD: హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం రూ. 450 కోట్ల వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ 'సిండికేట్' గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.