సచివాయలం ఆకస్మిక తనిఖీ
W.G: గణపవరం మండలం మోయ్యేరు గ్రామ సచివాలయాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా హాజరుపట్టిక, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆఫీసులో సిబ్బంది లేకపోవడంతో ఎంపీడీఓకి ఫోన్ చేసి రాని వారిపై మెమో జారీ చెయ్యాలని ఆదేశించారు.