రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా 'Arrive Alive' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐ రేణుకా రెడ్డి పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట టీటీడీ ఫంక్షన్ హాల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్య, ఎన్‌హెచ్-161 సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.