ఏనుగుల దాడి బాధిత రైతులకు వేగంగా పరిహారం..!

ఏనుగుల దాడి బాధిత రైతులకు వేగంగా పరిహారం..!

CTR: గుడిపాల మండలంలో ఏనుగుల దాడులతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం త్వరితగతిన పరిహారం అందిస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో 30 మంది రైతులకు రూ.2.76 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వన్యప్రాణాల దాడులను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులు అటవీశాఖ సూచనలు పాటించాలని ఆయన కోరారు.